నిర్మల్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫొటో స్టూడియో, కలర్ ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ల్యాబ్ మొత్తం వ్యాపించాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి ఫైర్ ఇంజన్ తో మంటలార్పుతున్నారు. ప్రమాదం జరిగిన కలర్ ల్యాబ్ జనావాసాలు, షాపుల మధ్య ఉండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం (మార్చి 7) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాత బస్టాండ్ కాంప్లెక్సులో ఉన్న సంతోష్ కలర్ ల్యాబ్, ఫొటో స్టూడియోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే ల్యాబ్ మొత్తం వ్యాపించడంతో అక్కడ ఉన్న ఎక్విప్‌మెంట్లు, మెషీన్లు పూర్తిగా తగలబడ్డాయి. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కలర్ ల్యాబ్ జనావాసాలు, దుకాణాల మధ్య ఉండటంతో స్థానికుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే మంటలు పక్కనున్న ఇండ్లు, షాపులకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
