Womens Day 2026 :  ఆ దీవిలో పెత్తనం అంతా ఆడ వాళ్లదే.. వాళ్లు చెప్పిందే శాసనం..!

Womens Day 2026 :  ఆ దీవిలో పెత్తనం అంతా ఆడ వాళ్లదే.. వాళ్లు చెప్పిందే శాసనం..!

చుట్టూ సముద్రం... మధ్యలో దీవి. ఆ దీవిలో అధికారమంతా ఆడవాళ్లదే! ఇంటి పనుల నుంచి మొదలుపెడితే వ్యవసాయం వరకూ మగవాళ్లు చేసే పనులన్నీ వాళ్లే చేస్తారు. అక్కడ నడిచేది మాతృస్వామ్యం! ఇదేదో జానపద కథలాగా ఉంది కదూ.. కాదు.. నిజంగా అక్కడ అంతా మహిళా రాజ్యమే.. మార్చి8న మహిళల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. . .!

 యూరప్ లో ఉన్న ఈస్టోనియా దేశంలో కిహ్ను దీవి కథ ఇది. ఈ దీవిలో మగవాళ్లు చేపల వేట కోసం నెలల తరబడి సముద్రంలోకి వెళ్తారు. దీంతో మగవాళ్లు చేసే పనులు కూడా ఆడవాళ్లే చేయాల్సి వచ్చేది. ఇది కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. మహిళలు స్ట్రాంగ్​ తా, ఇండిపెండెంట్​ గా  ఉండటానికి కూడా ఇదే చారిత్రక కారణం. కుహ్ను సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికీ చాలా ఆసక్తి కలిగిస్తాయి. వీళ్లు గౌన్లు, సంప్రదాయ దుస్తులే వేసుకుంటారు. వాటిని నేసేది కూడా వాళ్లే! 

►ALSO READ | Good Sleep: మంచి నిద్ర పట్టాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

సంప్రదాయంగా వస్తున్న పురాతన జానపదాలు, పురాతన డాన్స్ ఇక్కడ ఇంకా బతికే ఉన్నాయి. ఇక్కడి ప్రత్యేకమైన దుస్తులు, పురాతన జానపదాలు, పురాతన డాన్స్​ ను  యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. మెయిన్ ల్యాండ్​ తో  పోలిస్తే.. ఇక్కడి లైఫ్ చాలా డిఫరెంట్​ గా  ఉంటుంది. టూరిస్ట్ స్పాట్​ గా  ఉన్న ఈ దీవి వీడియోలు యూట్యూబ్​లో చూడొచ్చు.

వీళ్లు పాడే పెండ్లి పాటలకు, పెండ్లి సంప్రదాయాలకు 2 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, ఈ దీవిలో జనాభా ఇప్పుడు నాలుగు వందలకు పడిపోయింది. అందులోనూ మాతృస్వామ్యం తాలుకా ఆనవాళ్లుగా మిగిలిన చివరితరం ముసలివాళ్లే ఎక్కువ. ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ చాలామంది మగవాళ్లు, ఆడవాళ్లు సిటీల బాట పట్టడంతో అక్కడి జనాభా తగ్గిపోతోంది. దీవిలో తగ్గిపోతున్న జనాభాను చూసి వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు.