భర్త చనిపోయిన 20 రోజులకే మరో పెళ్లి చేసుకున్న భార్య.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..

భర్త చనిపోయిన 20 రోజులకే మరో పెళ్లి చేసుకున్న భార్య.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..

తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు తాలూకాలోని దాసరహళ్లిలో జనవరి 30న పరమేష్ అనే వ్యక్తి చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని అతని భార్య చెప్పడంతో బంధుమిత్రులంతా నిజమని నమ్మి అతని అంత్యక్రియలు కూడా జరిపించారు.

అయితే.. ట్విస్ట్ ఏంటంటే భర్త చనిపోయిన 20 రోజులకే మరో వ్యక్తిని పరమేష్ భార్య ఆషా పెళ్లి చేసుకుంది. భర్త చనిపోతే మరో పెళ్లి చేసుకోవడం నేరమూ కాదు, పాపం అంతకన్నా కాదు. కానీ.. భర్త చనిపోయిన 20 రోజుల వ్యవధిలోనే పరమేష్ భార్య చంద్రప్పను పెళ్లి చేసుకోవడంతో పరమేష్ ఫ్యామిలీకి డౌట్లు మొదలయ్యాయి. పరమేష్ అక్కాచెల్లెళ్లు ఆషాపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆషా, ఆమె పెళ్లి చేసుకున్న చంద్రప్పను పోలీసులు విచారించగా పరమేష్ను ఇద్దరూ కలిసి చంపేసి గుండెపోటుగా చిత్రీకరించారని విచారణలో వెల్లడైంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆషాకు పరమేష్ కూడా మొదటి భర్త కాదు. రెండో భర్త. చంద్రప్పతో ఏడాదిన్నర క్రితం ఆషాకు పరిచయం ఏర్పడింది. 

పరమేష్, చంద్రప్ప క్యాటరింగ్ బిజినెస్ చేసిన సమయంలో ఆషాతో చంద్రప్ప దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి పరమేష్కు తెలియకుండా వ్యవహారం నడిపించారు. చివరకు ఆ పరమేష్నే లేకుండా చేసి ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావించారు. పరమేష్ ఫ్యామిలీ ఫిర్యాదుతో ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరమేష్ డెడ్ బాడీకి రీ పోస్ట్ మార్టం చేశారు.