అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD) ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహిస్తారు. ఈసారి ( 2026) ఆదివారం ఈ వేడుక జరగనుంది. ప్రధానంగా మహిళలు, బాలికల విజయాలకు గుర్తింపుగా ఈ వేడుక జరుపుకుంటారు. ప్రతి ఆఫీసు, విద్యాసంస్థలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ప్రతి ఏడాది మార్చి 8నే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీని వెనక రీజన్ ఏంటీ..? మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
అణగారిన వర్గాలకు అణిచివేత సంకెళ్ల నుంచి విముక్తి కలిగించేందుకు కార్మిక వర్గాలు ఎన్నో
పోరాటాలు చేశాయి. ఇక్కడ మహిళలు కూడా అణగారిన వర్గాలకు చెందిన వారుగా గుర్తించాలి. కార్మిక
వర్గాల పోరాటాల్లో మహిళలు కూడా ముందుండి పాల్గొన్నారు. 1910 ఆగస్టు 26, 27వ తేదీల్లో 2వ
అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సు డెన్మార్క్ ని కోపెన్ హెగెన్లో జరిగింది.
ఈ సదస్సుకు క్లారా జెట్కిన్ అధ్యక్షత వహించగా 17 దేశాల నుంచి వంద మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మహిళలకు ఓటు హక్కు, మెటర్నిటీ ఇన్సూరెన్స్ తో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై చరిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ తర్వాత చాలా దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
►ALSO READ | Womens Day 2026 : ఆ దీవిలో పెత్తనం అంతా ఆడ వాళ్లదే.. వాళ్లు చెప్పిందే శాసనం..!
కానీ, అంతర్జాతీయంగా మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు 1977లో యునైటెడ్ నేషన్స్ సర్వసభ్య సభ తీర్మానం చేసి మార్చి8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆమోదించింది. 150 దేశాలు దీనికి మద్దతు ఇచ్చాయి. తమదేశాల్లో మహిళల పట్ల వివక్ష తొలగిస్తామని మహిళాదినోత్సవం తమ ఎజెండాలో ప్రధానాంశంగా ఉంటుందని ప్రకటించాయి. అప్పటి నుంచి మార్చి8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం .
ఐక్యరాజ్య సమితి కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 1975లో అధికారికంగా గుర్తించింది. ఇక 1977 నుంచి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ సంస్థలు, ఆఫీసుల్లో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలకు సమాన ప్రాధాన్యత, హక్కు, చదువు, అవకాశాలు కల్పించడం.. వారిపై హింసకు శుభం కార్డు వేయడం ప్రాధాన్యత ఇచ్చారు.
