హైదరాబాద్లో వైన్స్లో KF బీర్ కొన్న.. మద్యం ప్రియుడికి షాకింగ్ అనుభవం !

హైదరాబాద్లో వైన్స్లో KF బీర్ కొన్న.. మద్యం ప్రియుడికి షాకింగ్ అనుభవం !

హైదరాబాద్: నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్లో జేపీ వైన్ షాపులో బీరు కొనుగోలు చేసిన మద్యం ప్రియుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బీర్ బాటిల్లో చేప పిల్ల కదలాడుతుండడంతో చూసిన కస్టమర్ అవాక్కయ్యాడు. దీంతో మద్యం షాపు నిర్వాహకులను ప్రశ్నించారు. తమ దగ్గర తయారు కాలేదని, కేవలం అమ్మడం మాత్రమే చేస్తున్నామని.. కింగ్ ఫిషర్ పరిశ్రమను ప్రశ్నించాలని వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

బీర్ బాటిల్లో చెత్త, పురుగులు వంటివి రావటం గతంలో కొన్ని సందర్భాల్లో చూశాం. కానీ.. ఏకంగా చేప పిల్ల రావడంతో మద్యం ప్రియులు నివ్వెరపోయారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్న క్రమంలో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తరహాలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా డిస్టిలరీస్లో తనిఖీలు చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించని డిస్టిలరీస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.