నిస్సందేహంగా సరైన నిర్ణయమే.. ఇరాన్ నౌకకు ఆశ్రయం ఇవ్వడంపై భారత్ స్పందన

నిస్సందేహంగా సరైన నిర్ణయమే.. ఇరాన్ నౌకకు ఆశ్రయం ఇవ్వడంపై భారత్ స్పందన

ఇరాన్‌కు చెందిన ఐరిస్ లావన్‌ను కొచ్చిలో డాక్ చేసేందుకు భారత్  అనుమతించిన నిర్ణయాన్ని మానవతా దృక్పథంతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం (మార్చి7) సమర్థించారు. యుఎస్ దాడుల మధ్య నౌకాదళ సమీక్షలో భాగమైన ఈ నౌకకు భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఉన్నప్పటికీ సహాయం అందించామని, ఇది నిస్సందేహంగా సరైన నిర్ణయం అని  జైశంకర్ అన్నారు.

యూఎస్, ఇరాన్ మధ్య  కొనసాగుతున్న ఉద్రిక్తతల క్రమంలో  శ్రీలంక సముద్ర జలాల్లో  ఇరాన్ కు చెందిన ఐరీస్ దేనా యుద్ద నౌకను ఫిబ్రవరి 25న అమెరికాకు చెందిన జలాంతర్గామి  ముంచేసిన విషయంతెలిసిందే. ఆ సమయంలో భారత్ అనుమతితో శ్రీలంక ప్రభుత్వం ఐరీస్ దేనా లోని సిబ్బందిని కాపాడింది.  ఆ తర్వాత ఇరాన్ కు చెందిన మరో యుద్ద నౌక ఐరీస్ లావన్ కూడా సాంకేతిక లోపంతో ఫిబ్రవరి 28న ఆశ్రయం కోరింది. దీనిపై స్పందించిన భారత్ కోచి తీరంలో డాక్ చేసేందుకు అనుమతినిచ్చింది. 

ఇరాన్ నౌకలు భారత్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వచ్చాయి. ఆపద సమయంలో ఆశ్రయించారు. UNCLOS , అంతర్జాతీయ చట్టానికి లోబడి నౌకలకు ఆశ్రయమిచ్చాం.. మానవతా దృష్టితో నిర్ణయం తీసుకున్నాం.. మేం చేసింది సరైందేని భావిస్తున్నామని  రైసినా డైలాగ్ 2026లో  విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.   

ఫిబ్రవరి 18, 2026న విశాఖపట్నం తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో 74 దేశాల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో 70కి పైగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, జలాంతర్గాములు భారత నౌకాదళ శక్తిని ప్రదర్శించాయి. ఈ ఫ్లీట్ లో  ఇరాన్ కు చెందిన ఐరీష్ దేవా, ఐరీష్ లావన్ పాల్గొన్నాయి.