వాషింగ్టన్: సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యానికి గట్టి పోటీ ఇవ్వగల ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా దగ్గరున్న భారీ సాంకేతిక మానవ వనరులు, ఇంజినీరింగ్ నైపుణ్యాలకు దీటుగా నిలిచే సామర్థ్యం ప్రపంచంలో భారత్‌కే ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి జాకబ్ హెల్‌బర్గ్ కొనియాడారు.
వాషింగ్టన్‌లో జరిగిన ‘అమెరికా– ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్’ లీడర్‌షిప్ సమిట్–2026లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హెల్‌బర్గ్ భారతదేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రశంసించారు. భారత్ ను ప్రపంచ టెక్నాలజీ ఆధిపత్య పోటీలో అమెరికాకు అత్యంత కీలక భాగస్వామిగా పేర్కొన్నారు.
