బ్లాక్‌‌హాక్స్‌‌ జట్టులో శ్రునిక్‌‌, అక్షిత్‌

బ్లాక్‌‌హాక్స్‌‌ జట్టులో శ్రునిక్‌‌, అక్షిత్‌

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణకు చెందిన శ్రునిక్‌‌ (పెద్దపల్లి), అక్షిత్‌‌ (వరంగల్‌‌).. ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ (పీవీఎల్‌‌) ఫ్రాంచైజీ హైదరాబాద్‌‌ బ్లాక్‌‌హాక్స్‌‌ జట్టులో చోటు సంపాదించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన అండర్‌‌–21 ట్రయల్స్‌‌లో వీళ్లు మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చూపెట్టారు. కార్తీక్‌‌ (గుంటూరు), ధీమన్‌‌ (విశాఖపట్నం)కు కూడా జట్టులో స్థానం లభించింది. మొత్తం 12 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. 

శుభమ్‌‌ యాదవ్‌‌ (ఉత్తరప్రదేశ్‌‌), దీపక్‌‌ (హర్యానా), అయాజ్‌‌ అహ్మద్‌‌ (జమ్మూ కశ్మీర్‌‌), సార్థక్‌‌ (మధ్యప్రదేశ్‌‌), ప్రతీక్‌‌ (కర్ణాటక)తో పాటు తమిళనాడుకు చెందిన సురేశ్‌‌ కుమార్‌‌, రిజ్వాన్‌‌, శంకర్‌‌ ఇందులో ఉన్నారు. వీళ్లంతా ట్రయల్స్‌‌లో సత్తా చాటి జట్టులోకి వచ్చారు. ఇక గోవా వేదికగా శుక్రవారం ప్రారంభమైన అండర్‌‌–21 గోవా గార్డియన్స్‌‌ ట్రోఫీలో బ్లాక్‌‌హాక్స్‌‌ శుభారంభం చేసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌‌లో 3–0తో గెలిచింది.