జియో యూజర్లకు గుడ్‌న్యూస్..ఇకపై సిగ్నల్లేదు అనే మాటవినపడదు..ఎందుకంటే దేశవ్యాప్తంగా జియో తన కస్టమర్లకు కోసం బీఎస్ఎన్ ఎల్ నెట్ వర్క్ వినియోగించుకునేందుకు టైఅప్ అయింది. జియో నెట్‌వర్క్ సరిగాలేని, లేదా అసలు నెట్ వర్క్ లేని ప్రాంతాలలో BSNL తో కలిసి సేవలను అందించనుంది. BSNL నెట్ వర్క్ యాక్సెస్ చేయడానికి వీలుగా రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లకు కూడా తీసుకొచ్చింది.
ఈ ప్లాన్లతో జియో కస్టమర్లు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (ICR) సౌకర్యాన్ని పొందుతారు. దీంతో జియో సిగ్నల్ బలహీనంగా ఉన్న లేదా అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో BSNL నెట్‌వర్క్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవడం ద్వారా సేవలందిస్తుంది.
ప్రస్తుతం ఈ సదుపాయం మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్ సర్కిళ్లలోని జియో కస్టమర్లకు అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సేవలు విస్తరించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా జియో గ్రామీణ ప్రాంతాల్లో తన నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచి, కస్టమర్లకు నిరంతర మొబైల్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
జియో అందించే ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై BSNL ICR సేవ అందుబాటులో ఉంది.
జియో కొత్త ICR రీఛార్జ్ ప్లాన్‌లు
ప్రస్తుతం రెండు రీఛార్జ్ ప్లాన్‌లు .వాటి ధరలు రూ.196 , రూ.396. రెండూ 28 రోజుల చెల్లుబాటును అందిస్తాయి.
రూ. 196 ప్లాన్..డేటా 2GB, వాయిస్ కాల్స్ ..1000 నిమిషాలు,SMS 1000, వ్యాలిడిటీ 28 రోజులు
రూ. 396ప్లాన్..డేటా 10GB, వాయిస్ కాల్స్ ..1000 నిమిషాలు,SMS 1000, వ్యాలిడిటీ 28 రోజులు
