శ్రీరాంపూర్లో అమరవీరుల సంస్మరణ సభ

శ్రీరాంపూర్లో అమరవీరుల సంస్మరణ సభ

నస్పూర్, వెలుగు: భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం అసమాన త్యాగాలు చేసిన అమర యోధుల, వీరవనితల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఫలాలని సీపీఐ(ఎంఎల్)  న్యూడెమోక్రసీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ కాలనీలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. పార్టీ పిలుపుతో నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించామన్నారు. 

నాడు పీడిత ప్రజల కోసం అనేకమంది విప్లవకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్​టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు బ్రహ్మానందం, మేకల రామన్న, అరుణోదయ రాష్ట్ర నాయకులు మల్లన్న, రెడ్డిమల్ల ప్రకాశం, తిరుపతి రెడ్డి, రత్నం తిరుపతి, దొండ ప్రభాకర్, ముష్కి జ్యోతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.