డీల్ ఏం లేదు.. ఇరాన్ సరెండర్ అవ్వాల్సిందే: ట్రంప్ డెడ్లీ వార్నింగ్

డీల్ ఏం లేదు.. ఇరాన్ సరెండర్ అవ్వాల్సిందే: ట్రంప్ డెడ్లీ వార్నింగ్

ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా భీకర యుద్ధం చేస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్కు సరెండర్ అవ్వడం తప్ప మరో డీల్ లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా ముందు మోకరిల్లితే ఇరాన్కు మంచి భవిష్యత్ ఉంటుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ను ఆర్థికంగా శక్తివంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పారు.

“MAKE IRAN GREAT AGAIN (MIGA!).” అని ట్రంప్ పోస్ట్ చేయడం గమనార్హం. అమెరికా చేసిన ఈ ప్రతిపాదనకు ఇరాన్ ‘‘నో’’ చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో ఇరాన్ అమెరికాపై ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇజ్రాయెల్-అమెరికాను వీలైనంత దెబ్బ తీసేందుకే ఇరాన్ పావులు కదుపుతోంది.

ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి, ఏకకాలంలో 9 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఖతార్‌‌‌‌లోని అల్ ఉదైద్, బహ్రెయిన్‌‌‌‌లోని 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, ఇరాక్, కువైట్‌‌‌‌లోని స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడులు చేసింది. ఇరాన్ డ్రోన్ దాడులకు గురైనవాటిలో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ (ఖతార్), అల్ దఫ్రా ఎయిర్ బేస్ (యూఏఈ), అలీ అల్-సలేం ఎయిర్ బేస్ (కువైట్), నేవీ 5వ ఫ్లీట్(బహ్రెయిన్) ఉన్నాయి.

అలాగే మువఫక్ అల్-సల్తీ ఎయిర్ బేస్ (జోర్డాన్), ఐన్ అల్-అసద్ ఎయిర్ బేస్, ఎర్బిల్ ఎయిర్ బేస్ (ఇరాక్)పై ఇరాన్ మిసైల్ అటాక్స్ చేసింది. అమెరికా గనుక భూతల దళాలను రంగంలోకి దించితే "అమెరికాకు వేల సంఖ్యలో శవపేటికలు తిరిగి వెళ్తాయి" అని ఇరాన్ రాయబారి హెచ్చరించారు.