అభిషేక్ను సాగనంపే టైమొచ్చిందా.. కుల్దీప్ ఖాయమైనట్లేనా.. ఫైనల్కు ప్లేయింగ్ 11 ఇదే..?

అభిషేక్ను సాగనంపే టైమొచ్చిందా.. కుల్దీప్ ఖాయమైనట్లేనా.. ఫైనల్కు ప్లేయింగ్ 11 ఇదే..?

ఊపు ఊపుతారు అనుకున్న వాళ్లు ఊపలేకపోయారు. ఢీలా పడ్డారు.. ఇక ఇతని పని అయిపోయినట్లే అనుకున్న ప్లేయర్ మాత్రం టీమిండియాను సెమీస్ కు చేర్చి.. ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వరల్డ్ ఆరంభానికి ముందున్న అంచనాలు. అదే విధంగా దొరక్క దొరక్క ఛాన్స్ దొరికితే వరుసగా విఫలమవుతూ..  నువ్వే దిక్కు సామీ అనుకునే వరకు వచ్చిన సంజూ శాంసన్ గురించి. భారీ అంచనాల నడుమ టీమిండియాలో చోటు సంపాదించుకున్న ప్లేయర్లు వరుసగా విఫలమవుతుండటంతో.. ఫైనల్ లో ఆడిస్తారా లేదా అనే చర్చ ఫ్యాన్స్ లో మొదలైంది. 

  టీ20 వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ చేరిన సందర్భంగా ఫైనల్ జట్టులో ఉండే ఆటగాళ్లెవరు అనే డిస్కషన్ జోరుగా నడుస్తోంది. మార్చి 8న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ లో న్యూజీలాండ్ తో తలపడనుంది టీమిండియా. ప్లేయింగ్ 11 కి కొన్ని మార్పులు చేర్పులు ఉండనున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. 

కుల్ దీప్, రింకూ సింగ్ లేదా వాషింగ్టన్ సుందర్.. ఛాన్స్ ఎవరికి..?

వరల్డ్ నెం.1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ టౌర్నమెంట్లో వండర్స్ చేస్తాడని అందరూ భావించారు. కానీ 7 మ్యాచ్ లు ఆడి కేవలం 89 రన్స్ మాత్రమే చేయడం ఆందోళన కలిగించే అంశం. ఓపెనర్లు వరుసగా విఫలమవుతూ.. మిడిలార్డర్ల మీద భారం వేస్తుండటంతో ఫైనల్ లో జట్టులో కీలక మార్పులు చేయాలని సెలెక్టర్లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఫైనల్ లో అభిషేక్ కు రెస్ట్ ఇచ్చి ఇతని ప్లేస్ లో రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకునే చాన్స్ ఉందని క్రీడా వర్గాల అంచనా.

మొదటి నుంచీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్.. సెమీస్ లో ఘోరంగా విఫలమయ్యాడు. 7 బంతులలో కేవలం 9 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ఫైనల్ లో శర్మ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ టోర్నమెంట్లో ఇషాన్ రెండు అర్థసెంచరీలతో ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. 

ఇక అభిషేక్ స్థానంలో జట్టులోకి కుల్ దీప్ యాదవ్, రింకూ సింగ్ లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకునే  చాన్స్ ఉందని అంటున్నారు. ఇండియా బ్యాటర్లు భారీ స్కోర్ టార్గెట్ ఇస్తున్నప్పటికీ.. బౌలింగ్ లో కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి. దీంతో కుల్దీప్ నే తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

గురువారం ముంబైలో జరిగిన సెమీఫైనల్లో, స్పెషలిస్ట్ ఆరవ బౌలర్‌ లేకండా  ఇండియా ముందుకెళ్లింది. కానీ ఫైనల్లో స్పెషలిస్ట్ ను తీసుకునే చాన్స్ ఉంది. టీ20 ల్లో కుల్దీప్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.  54 T20I మ్యాచ్‌ల్లో 95 వికెట్లు సాధించాడు . వరుణ్ చక్రవర్తి భారీగా రన్స్ ఇస్తున్న క్రమంలో .. ఆతిథ్య జట్టు (సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 64 రన్స్ ఇచ్చాడు), ఫైనల్లో కుల్దీప్ ఆతిథ్య జట్టుకు మంచి వికెట్-టేకింగ్ ఆప్షన్ అవుతారనేది ఎనలిస్టుల అభిప్రాయం.  ఇండియా తరపున పెద్ద మ్యాచ్‌లు,  టోర్నమెంట్లలో  ఇప్పటికే తన టాలెంటేంటో నిరూపించుకున్నాడు కుల్దీప్.  ఇందులో న్యూజిలాండ్‌తో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, కుల్దీప్ రెండు వికెట్లు తీసుకుని తన సత్తా ఏంటో చాటాడు. 

ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్‌లో, కుల్దీప్ పాకిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు, ఆ మ్యాచ్‌లో  మూడు ఓవర్ల కోటాలో 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ రీప్లేస్ మెంట్ కు  సుందర్, రింకు లను మంచి ఆప్షన్ గా సెలెక్టర్లు భావిస్తున్నారు. 

ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఇదే ..?

న్యూజిలాండ్‌తో జరిగే T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు భారత్ ఆడే అవకాశం ఉన్న XI: సంజు శాంసన్ (WK), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (C), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కులదీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి