పవిత్ర రంజాన్‌మాసం ఇఫ్తార్‌విందులో పాల్గొన్నారు మంత్రి వివేక వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ కుమార్‌దీపక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ ముస్లింలందరూ గంగా జమునా తహజీబ్ లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లా ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మంత్రి ప్రార్థనలు జరిపారు.
అంతకుముందు మంత్రి వివేక వెంకటస్వామి చెన్నూరు మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
