యుద్ధం ముదురుతోంటే పడిపోతున్న బంగారం.. శుక్రవారం హైదరాబాద్ రేట్లు ఇవే..

యుద్ధం ముదురుతోంటే పడిపోతున్న బంగారం.. శుక్రవారం హైదరాబాద్ రేట్లు ఇవే..

సాధారణంగా యుద్ధాలు లాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఇరాన్ వార్ వేళ ఈ సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధం ముదురుతున్న కొద్దీ గోల్డ్ రేట్లు తగ్గటం చూస్తున్న చాలా మంది కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వెండి రేట్లు కూడా తక్కువ అస్థిరతలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు తమ నగరాల్లో తగ్గిన రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.

మార్చి 6న బంగారం రేట్లు భారీగా తగ్గి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో మార్చి 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.77 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 211గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 860గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 6, 2026న దేశవ్యాప్తంగా రేట్లలో మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 90వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.290 వద్ద ఉంది.