కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట X రోడ్డుపై బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులను లారీ వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన తాటికొండ సాయికిరణ్(23), చిలుక ప్రదీప్(23) ఇద్దరూ చాకుంటలో జరుగుతున్న వివాహానికి రుక్మాపూర్ గ్రామం నుంచి బైక్పై వెళ్లుతున్నారు.
అతి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్ను వెనుకాల నుంచి ఢీకొట్టి ఇద్దరి తలల నుంచి టైర్లు ఎక్కడంతో మెదడు బయటకు చిట్లి స్పాట్లోనే ఇద్దరూ చనిపోయారు. వివాహానికి బయలు దేరిన ఐదు నిమిషాల లోపే ఇద్దరు ఫ్రెండ్స్ లారీ యాక్సిడెంట్లో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై లారీ - సూపర్ లగ్జరీ బస్సు ఢీ కొని ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మహబూబ్ నగర్ ఏరియా హాస్పిటల్కి తరలించారు.
