ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ (Flipkart) కూడా ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై లేఆఫ్స్ అస్త్రం ప్రయోగించింది. వార్షిక పనితీరుపై సమీక్ష చేశాక దాదాపు 300 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. మరోపక్క.. ఐపీఓకు ప్లాన్ చేసిన ఫ్లిప్ కార్ట్ సీనియర్ లెవెల్ఉద్యోగులను నియమించుకుంటుండటం కొసమెరుపు. అయితే.. ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగులకు ట్రాన్సిషన్ సపోర్ట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే విషయం. ఫ్లిప్ కార్ట్లో మొత్తం 20 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Flipkart lets go of 300 employees as part of annual performance review
— Chandra R. Srikanth (@chandrarsrikant) March 6, 2026
Walmart-owned e-commerce major Flipkart has let go of around 300 employees as part of its annual performance review cycle, according to people familiar with the development.
The latest round of exits impacts…
అంటే.. ఫ్లిప్ కార్ట్ మొత్తం వర్క్ ఫోర్స్లో 3 నుంచి 4 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఫ్లిప్ కార్ట్ లీగల్ ఆఫీస్ను సింగపూర్ నుంచి ఇండియాకు మార్చేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి ఈ ఈ-కామర్స్ సంస్థకు డిసెంబర్ 2025లో అనుమతి లభించిన సంగతి తెలిసిందే. 2025 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్ కార్ట్ 5 వేల 189 కోట్ల రూపాయల నష్టాన్ని చూపించింది. Myntra, Flipkart Wholesale, Cleartrip, super.money ఇవన్నీ.. ఫ్లిప్ కార్ట్ గ్రూప్ కంపెనీలే కావడం గమనార్హం.
