Ashika Ranganath: లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తున్న ఆషికా.. 'విశ్వంభర' బ్యూటీ నయా లుక్ వైరల్!

Ashika Ranganath: లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తున్న ఆషికా.. 'విశ్వంభర' బ్యూటీ నయా లుక్ వైరల్!

'అమిగోస్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్.  ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్ష కుల మనసులను కొల్లగొట్టింది. ఆతర్వాత 'నా సామిరంగా' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ అందాల భామ. ఈ నంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'విశ్వంధర' లోపాటు 'సర్దార్ 2' వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. 

ఫర్ ఏ వెరీ స్పెషల్ ఈవెంట్..

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ 'ఫర్ ఏ వెరీ స్పెషల్ ఈవెంట్' అంటూ కొన్ని ఫొటోలని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చేతిలో తెల్లని గులాబీ, ముక్కుకు ముక్కెరతో గుండె గిల్లుతున్న ఈ అందాల భామ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. లెహంగాలో మెరిసిపోతున్న ఆషికా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'అందమైన గులాబీ సంధింగ్ అమ్మడూ' అంటూ కామెంట్లతో ముంచెత్తు తున్నారు.

 

మా శరీర భాగాలపై కెమెరా ఎందుకు?

ఇక ఈ బ్యూటీ ఇటీవల నటీమణుల నటనను, వారి ప్రతిభను పక్కన పెట్టి.. కేవలం వారి శరీర భాగాలను అనుచితంగా చూపిస్తూ వ్యూస్ కోసం కొందరు ఫొటోగ్రాఫర్లు  పాకులాడుతున్నారంటూ సీరియస్ అయింది. "మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం, మా సినిమా కోసం.. అంతేకానీ మా శరీర భాగాలను జూమ్ చేసి చూపించడానికి కాదు" అంటూ సోషల్ మీడియాలో అషికా పెట్టిన పోస్ట్‌లు  ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

మానసిక వేదనకు గురిచేస్తోంది..

కొందరు ఉద్దేశపూర్వకంగా నటీమణులు కారు దిగేటప్పుడు, కూర్చునేటప్పుడు, ఈవెంట్స్ లలో అనుచితమైన యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తున్నారని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు.. వస్త్రధారణలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని హైలైట్ చేస్తూ జూమ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఒక వృత్తిపరమైన నేరం అని  మండిపడ్డారు. ఇది మా హుందాతనాన్ని దెబ్బతీయడమే కాకుండా, మమ్మల్ని మానసిక వేదనకు గురిచేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.