సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ తనదైన శైలిలో, బోల్డ్ నిర్ణయాలతో ట్రెండ్ సెట్ చేసే బాలీవుడ్ నటి నీనా గుప్తా. 66 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం తగ్గకుండా తన ఫ్యాషన్ సెన్స్ తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంటారు. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఆమె మెరిసారు. అయితే ఈ సందర్భంగా ఆమె దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
'విరోష్' వేడుకలో మెరిసిన నీనా
టాలీవుడ్ జంట రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ (Virosh) వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో మార్చి 4, 2026న అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తన భర్త వివేక్ మెహ్రాతో కలిసి హాజరైన నీనా గుప్తా, తన ఆహార్యంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఐవరీ కలర్ చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. గోల్డ్ ఫాయిల్ మోటిఫ్స్, జరీ బోర్డర్ ఉన్న ఈ చీరను మోడ్రన్ హాల్టర్-నెక్ బ్లౌజ్‌తో ధరించి తనదైన 'ఎలిగెన్స్'ను చాటుకున్నారు.
వైరల్ అవుతున్న 'బేబీ బంప్' ఫోటోలు!
అయితే, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె కట్టుకున్న చీర డ్రేపింగ్ స్టైల్ కారణంగా, పొట్ట భాగంలో కొంచెం ఉబ్బెత్తుగా బేబీ బంప్ లాగా కనిపించింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తించారు. ఈ వయసులో నీనా గుప్తా ప్రెగ్నెంట్ అయ్యారా?" అని కొందరు ప్రశ్నిస్తుంటే.. వావ్.. ఆమె నిజంగానే బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ.. అది ఆమె వ్యక్తిగత విషయం, వయసుతో సంబంధం లేకుండా ఆమె అందంగా కనిపిస్తోంది, అనవసరంగా ట్రోల్ చేయకండి అని హితవు పలుకుతున్నారు.
నీనా గుప్తా బోల్డ్ లైఫ్
నీనా గుప్తా ఎప్పుడూ సంప్రదాయాలకు అతీతంగా జీవించిన వ్యక్తి. 1980వ దశకంలోనే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోకుండానే 'మసాబా గుప్తా'కు జన్మనిచ్చి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2008లో చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో 'బధాయి హో', 'పంచాయత్' వంటి చిత్రాలతో సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. తాజాగా రష్మిక-విజయ్ జోడీని విష్ చేస్తూ.. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కలవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
66 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ సాధ్యమేనా?
అయితే 60 దాటిన వయసులో ప్రెగ్నెంట్ అవ్వడం సాధ్యమేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొన్ని ఆధునిక పద్ధతుల్లో సాధ్యమేనని గతంలో కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎర్రమట్టి మంగాయమ్మ 2019లో 74 ఏళ్ల వయస్సులో IVF ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించారు. అదే విధంగా పంజాబ్‌కు చెందిన దల్జిందర్ కౌర్ కూడా 70 ఏళ్ల వయస్సులో బిడ్డను కన్నారు.
క్లారిటీ ఏది?
ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై నీనా గుప్తా కానీ, ఆమె ప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం చీర కట్టుకున్న విధానం వల్ల వచ్చిన మార్పు మాత్రమే అయి ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నారు. ఏది ఏమైనా, 66 ఏళ్ల వయసులోనూ నీనా గుప్తా తన ఫ్యాషన్ తో, తన చుట్టూ జరిగే చర్చలతో మళ్ళీ వార్తల్లో నిలిచారు..
