సివిల్స్ ఫలితాల్లో.. సత్తాచాటిన జనగామ యువకుడు

సివిల్స్ ఫలితాల్లో..  సత్తాచాటిన జనగామ యువకుడు

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలంగాణ యువకుడు సత్తా చాటాడు.జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చపహాడ్ గ్రామానికి చెందిన బానోత్ భరత్ కుమార్ సివిల్స్‌లో ర్యాంకు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. శుక్రవారం (మార్చి 6) ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో భరత్ కుమార్​ ఆల్ ఇండియా స్థాయిలో 900వ ర్యాంకు సాధించారు.

భరత్ కుమార్ మూడో ప్రయత్నంలో ఈ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటికే 2023లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) కు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో  ఉన్నాడు.మరోసారి సివిల్ సర్వీసెస్ పరీక్షలో రాణించి ఈ ఘనతను సాధించారు.

భరత్ కుమార్ విజయం పట్ల ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు కూడా భరత్ కుమార్ సాధించిన విజయంపై గర్వం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందిస్తున్నారు. భారత్​ సాధించిన ఘనత యువతకు ప్రేరణగా నిలుస్తుందని స్థానికులు చెబుతున్నారు.