హైదరాబాద్ లోని ఈ ఏరియాలో రెండు రోజులు నీటి సరఫరా బంద్

 హైదరాబాద్ లోని ఈ ఏరియాలో రెండు రోజులు నీటి సరఫరా బంద్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మంజీరా ఫేజ్–-3, పెద్దాపూర్ పంప్ హౌస్ లో  35 ఏండ్లకు పైబడిన హెచ్​టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్​ను తొలగించి, కొత్త ప్యానెల్స్‌‌ ఏర్పాటు చేస్తుండడంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. అలాగే, పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం  డయా పంపింగ్ మెయిన్ పైప్‌‌లైన్‌‌లోని ఎయిర్ వాల్వ్‌‌లను, సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్ పైప్‌‌లైన్‌‌లోని ఎయిర్ వెంట్స్‌‌ను మారుస్తున్నట్టు చెప్పారు.

7న శనివారం ఉద‌‌యం 8 గంట‌‌ల‌‌ నుంచి 8వ తేదీ ఆదివారం రాత్రి 8 గంట‌‌ల వ‌‌ర‌‌కు కొనసాగుతాయన్నారు. ఈ కారణంగా శని, ఆదివారాల్లో నీటి సరఫరా ఉండదని తెలిపారు. షేక్‌‌పేట్ పరిధిలోని మణికొండ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెషర్​తో నీళ్లు వస్తాయని చెప్పారు.