తెలంగాణలో ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం ( నవంబర్ 9 ) హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. శ్రీలీల ఐటెం సాంగ్ కి కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదని ఎద్దేవా చేశారు. తమపై కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ సినిమాలో ఐటెం సాంగ్ లాగా ఉన్నాయని అన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కాదని అన్నారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారని.. వాళ్ళు చేసిన అప్పులు తీరుస్తూ పధకాలు అమలు చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం వల్ల ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నిధుల దుర్వినియోగం చేసిందని.. రూ. 20 లక్షలతో నికరంగా ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందని.. డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు సీఎం రేవంత్.
►ALSO READ | చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు.. ఏఆర్వో సస్పెన్షన్, కేసు నమోదు
ఎవరి వాస్తు కోసం ఇవన్నీ కట్టారని అన్నారు. ఎవరి మీద నిఘా కోసం, ఎవరి వాస్తు కోసం ఇవన్నీ కట్టారని ప్రశ్నించారు. ఆయన దశ, దిశ సరిగా లేనప్పుడు వాస్తు మారిస్తే ఏమొస్తుందని అన్నారు. ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖ లేనేలేదని అన్నారు.కుటుంబసభ్యులను సరిగా చూడలేనోడు ప్రజలను సరిగా చూసుకుంటాడా అని అన్నారు. ఒక్క ఉద్యోగం రాని సచివాలయం, కమాండ్ కంట్రోల్ కట్టారని మండిపడ్డారు సీఎం రేవంత్.
