బాలీవుడ్ యంగ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, అర్జున కపూర్ జంటగా నటించిన మూవీ 'ది లేడీ కిల్లర్' . అజయ్ భేల్ దర్శకుడు. రూ.45 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే 2023లో వచ్చిన ఈ చిత్రం వైఫల్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకుందీ ముద్దుగుమ్మ.
తొలుత 'నాకు ఇచ్చిన ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. కానీ, అందులో చాలా భాగాన్ని తెరకెక్కించలేదని భూమి పెడ్నేకర్ చెప్పింది . అసంపూర్తిగానే సినిమా రిలీజ్ చేశారు. ఇదినాకు ముందే తెలిసుంటే బాగుండేది. నేను కూడా మేకింగ్ లో భాగమై లేను . ఒక వేళ ఉండి ఉంటే వేరేలా ఉండేదని తెలిపింది. ఖచ్చితంగా కొన్ని విషయాలను మార్చగలిగేదాన్ని. అయినా జరిగినదానికి నేను షాక్ లోనే ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అలా జరగలేదు తెలిపింది.
కాబట్టి ఈ సినిమా పరిస్థితేంటా? అని భయపడ్డాను. చివరకు ఇది ఒక గుణపాఠం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. వ్యక్తిగతంగా. వృత్తిపరంగా నన్ను చాలా బాధనిట్టింది మాత్రం ఈ సినిమానే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది భూమి. ఇక నా పనైపోయిందనుకున్న' అంటూ చెప్పుకొచ్చింది. ఇక భూమి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'దల్ధాల్' ఈ క్రైమ్ థ్రిల్లల్ లో డీసీపీ రేటా రోల్ లో నిందితులన్ని పరుగులు పెట్టించింది. ఈ సిరీస్ గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటోంది.
