దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముగ్గురిని గుజరాత్పోలీసులు అరెస్ట్ చేశారు. దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని, భారీ ఉగ్రకుట్రకు ప్రయత్నించిన హైదరాబాదీ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ తోపాటు మరో ఇద్దరిని గుజరాత్ ATS పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సయ్యద్ మొహియుద్దీన్ ఫ్రాన్స్ లో MBBS చదివినట్లుగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం హైదరాబాద్ లోని సయ్యద్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ISKP సభ్యులతో టెలిగ్రామ్ ద్వారా సంబంధాలున్న ట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. అతని వద్ద 2గ్లాక్ పిస్టల్స్, 1 బెరట్టా పిస్టల్, 30 లైవ్ క్యాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం కోర్టులో హాజరు పర్చగా మొహియుద్దీన్ ను నవంబర్ 18 వరకు రిమాండ్ విధించింది.
