హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి, 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని జగన్కు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా జగన్ భట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.
