నవంబర్ 11 నుంచి 19 వరకు..తెలంగాణలోని ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

నవంబర్ 11 నుంచి 19 వరకు..తెలంగాణలోని ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. చాలా జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పలు  జిల్లాల్లో నవంబర్ 11 నుంచి 19 వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది వాతావరణ శాఖ.  

ఆదిలాబాద్,నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల,నిజామాబాద్, కామారెడ్డి, మెదక్,సిద్దిపేట,సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో   9 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు నమోదవుతాయని  తెలిపింది. 

ఉమ్మడి ఆదిలాబాద్ కు వాతావరణ వాఖ  హెచ్చరికలు  జారీ చేయడంతో   ఆదిలాబాద్ జిల్లా  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని  కోరారు జిల్లా కలెక్టర్ రాజర్షి  షా.   చిన్న పిల్లలు, వృద్ధులు, గర్బిణి  మహిళలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు  కలెక్టర్.