ఇండియా–అమెరికా మ్యాచ్‌కు ముందు వాంఖడే స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. పెర్కషన్ విద్వాంసుడు డ్రమ్స్ శివమణి, రిషబ్ శర్మ సంగీత విన్యాసాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించగా, ఆకాశం నుంచి జెట్‌ప్యాక్ ద్వారా స్టేడియంలోకి ట్రోఫీ రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
2024 డిఫెండింగ్ చాంపియన్ కెప్టెన్, మెగా టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ ట్రోఫీని గ్రౌండ్‌లోకి తెచ్చాడు. ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి అధికారికంగా టోర్నీని ప్రారంభించాడు. బాలీవుడ్ సింగర్ బాద్షా, నటి నోరా ఫతేహీ పెర్ఫామెన్స్, బాణాసంచా వెలుగులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.
