న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా షూటర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని చూపెడుతున్నారు. స్టార్ షూటర్ ఇలవేనిల్ వలారివన్ డబుల్ గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటింది. శనివారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో వలారివన్ 252.0 స్కోరుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మేఘన సజ్జనార్ 229.5 స్కోరుతో కాంస్యం నెగ్గగా.. జపాన్ షూటర్ మిసాకి నోబటా (251.5) రజతం గెలుచుకుంది.
అనంతరం టీమ్ ఈవెంట్‌లో మేఘన, ఆర్య బోర్సేతో కలిసి ఇలవేనిల్ మరో స్వర్ణం గెలిచింది. ఫైనల్లో ఇండియా 1892.6 పాయింట్లతో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది.. మెన్స్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఇండియా టాప్ షూటర్ సౌరభ్ చౌదరి (536) స్వర్ణంతో మెరవగా, కమల్‌జీత్ చౌదరి (561) రజతం, రవీందర్ సింగ్ (559) కాంస్య పతకాలతో క్లీన్‌స్వీప్ చేశారు.
