కోహెడ, వెలుగు: అధునాతన మై-వాన్ సాంకేతిక విధానంలో ఇటుకలు వాడకుండా తెలంగాణలోనే రోల్ మోడల్‌గా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నామని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి తెలిపారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లి శివారులో నిర్మిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ పనులను ఆమె పరిశీలించారు. నిర్మాణ నాణ్యతలో ఖమ్మం జిల్లాతో సమానంగా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కోహెడ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అక్కడి స్టాక్ రిజిస్టర్ సరిగ్గా నిర్వహించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులపై విచారణ జరిపాలని డీసీఓను ఫోన్లో ఆదేశించారు.
