కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ నగర్‌లోని ఏబీసీ పెయింటింగ్ పరిశ్రమలో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.   ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని  మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా కంపెనీలో ఎంతమేర ఆస్తి నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.