అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు మృతి

అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన  ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు మృతి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజు మృతి చెందారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో  ఇవాళ ఉదయం అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలారు. రాజు కుప్పకూలడాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి ఆయనకు సీపీఆర్ చేశారు.

అనంతరం చికిత్స నిమిత్తం రాజును ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలోనే రాజు మృతి చెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. రాజు మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.