అంటరానితనం పేరుతో శుద్ధికరణలు సిగ్గుచేటు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

అంటరానితనం పేరుతో శుద్ధికరణలు సిగ్గుచేటు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఎట్టకేలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విషయంలో ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో  దిగొచ్చిన ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ శుద్దీకరణపై 15మందిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.  ఖర్గే వ్యవహారంలో  బీజేపీ ప్రభుత్వం తీరును ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా అంటరానితనం ఏందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు.  

స్వాతంత్ర్యం వచ్చి80ఏళ్లు గడుస్తున్నా.. అంటరానితనం పేరుతో శుద్ధి చేయడం సిగ్గు చేటన్నారు వంశీకృష్ణ. మల్లికార్జున్ ఖర్గే వ్యవహారంలో బీజేపీ నేతలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పార్లమెంట్ సభ్యులకే ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఆందోళన వ్యక్తం చేశారు.  బీజేపీ ప్రభుత్వం తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

ALSO READ : బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు మళ్లీ అరెస్ట్.. 

ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో దేశాన్ని నడిపించాలని బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.  అంటరానితనం పేరుతో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేస్తామన్నారు. ఇలాంటి దాడులకు, మనస్మృతి ఐడియాలజికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.