పేపర్ లీక్ వల్ల బెటర్ స్కోర్ చేశారన్న నిర్మలా సీతారామన్.. అన్ని పేపర్లు లీక్ చేయాలన్న CJP !

పేపర్ లీక్ వల్ల బెటర్ స్కోర్ చేశారన్న నిర్మలా సీతారామన్.. అన్ని పేపర్లు లీక్ చేయాలన్న CJP !

ఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక జాతీయ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేపర్ లీక్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. " కొందరు యువకులు ఇలా అన్నారు.. 'అవును, మొదట్లో ప్రశ్నా పత్రం లీక్ అయినప్పుడు కొంత బాధ కలిగింది. కానీ ఆ తర్వాత ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని మరింత బాగా పరీక్షకు సన్నద్ధమయ్యాను, దాంతో స్కోర్ మెరుగుపడింది.' అని కొందరు నీట్ అభ్యర్థులు చెప్పారని నిర్మలా సీతారామన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇలా ఈ పేపర్ లీక్ను సవాల్గా భావించి విజయవంతంగా ఉత్తమ మార్కులు తెచ్చుకున్న యువత ఉన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పందిస్తోంది, ప్రధానమంత్రి కూడా స్పందిస్తున్నారు," అని సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక.. నిర్మలా సీతారామన్ లాజిక్ ప్రకారం.. ప్రతీ ఎగ్జామ్ పేపర్ లీక్ చేయాలని.. అప్పుడు మరింత బెటర్ స్కోర్ను స్టూడెంట్స్ సాధిస్తారని CJP ఎద్దేవా చేసింది.

రీ ఎగ్జామ్ త్వరితగతిన నిర్వహించడం, ఫలితాలను సకాలంలో ప్రకటించడం వల్ల విద్యార్థులు తమ విద్యా ప్రణాళికలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించగలిగారని సీతారామన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. NEET పేపర్ లీక్ చేసిన నిందితులను అరెస్ట్ చేసి.. రీఎగ్జామ్ సకాలంలో నిర్వహించకుండా ఉండి ఉంటే యువత ఉన్నత విద్య కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆమె చెప్పుకొచ్చారు.