- కలెక్టర్రాజర్షి షా హెచ్చరిక
- లబ్ధిదారులకు రశీదుల పంపిణీ
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన డబుల్బెడ్రూం ఇండ్లను విక్రయించినా, అద్దెకు ఇచ్చినా కేటాయింపులను రద్దు చేస్తామని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోని 6వ వార్డు నుంచి 16వ వార్డుల్లోని డబుల్బెడ్రూం లబ్ధిదారులకు శుక్రవారం మున్సిపల్‌కార్యాలయంలో చైర్పర్సన్బండారి అనూషతో కలిసి రశీదులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. వార్డుల వారీగా అర్హులైన లబ్ధిదారులను పూర్తి పారదర్శకతతో లక్కీ డ్రా విధానంలో ఎంపిక చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం కేఆర్‌కే కాలనీ, మావల ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తున్నామని తెలిపారు. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అధికారిక ప్రొసీడింగ్స్ కాపీలను అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
