ఆదిలాబాద్ జిల్లా : పత్తి చేనులో గంజాయి సాగు..51 మొక్కలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్..

ఆదిలాబాద్ జిల్లా : పత్తి చేనులో గంజాయి సాగు..51 మొక్కలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్..

నేరడిగొండ, వెలుగు: పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ఆరేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన సిడాం గంగారాం అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా అదుపులోకి తీసుకుని విచారించారు. 

పత్తి చేనులో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 51 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేశ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొక్కల విలువ సుమారు రూ.5.10 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఎస్సై సయ్యద్ ఇమ్రాన్, పోలీసు సిబ్బంది తదితరులు 

పాల్గొన్నారు.