హైదరాబాద్లో ఏసీవీఎస్ సదస్సు ప్రారంభం .. 26 వరకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు చర్చ

హైదరాబాద్లో ఏసీవీఎస్ సదస్సు ప్రారంభం .. 26 వరకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు చర్చ

హైదరాబాద్​, వెలుగు: అడ్వాన్స్‌‌డ్ కార్డియోవాస్క్యులర్ టెక్నిక్స్ అండ్ సొల్యూషన్స్ (ఏసీవీఎస్) 17వ ఎడిషన్ అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు హైదరాబాద్​లో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 26 వరకు కార్యక్రమం కొనసాగనుంది.  దేశవిదేశాలకు చెందిన 1,500 మంది  ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

గుండె సంరక్షణకు సంబంధించిన కొత్త వైద్య విధానాలు, సమస్యల నివారణ, నిర్వహణపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు.  విదేశీ డాక్టర్లు 23 లైవ్ కేసులను ప్రదర్శించనున్నారు. అమెరికా నుంచి ప్రత్యక్షంగా ప్రసారం కానున్న మొట్టమొదటి లైవ్ ట్రాన్స్‌‌కాథెటర్ అయోర్టిక్ రిగర్జిటేషన్ ఇంటర్వెన్షన్‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.