కేటీఆర్ కు సన్నబియ్యం..పుట్టినరోజు కానుకగా పంపించిన కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్

కేటీఆర్ కు సన్నబియ్యం..పుట్టినరోజు కానుకగా పంపించిన కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 25 కిలోల సన్న బియ్యం బ్యాగ్ ను కాంగ్రెస్ నేత, ఫిషరీస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కానుకగా ఇచ్చారు. శుక్రవారం గాంధీ భవన్ నుంచి ర్యాపిడో ద్వారా ఈ బియ్యం  బ్యాగ్ ను తెలంగాణ భవన్​కు పంపించారు.

అనంతరం సాయికుమార్​ మాట్లాడుతూ.. ఇటీవల కేటీఆర్​ఓ నిరుపేద ఇంట్లోకి వెళ్లి  సర్కారు ఇస్తున్న సన్న రేషన్​ బియ్యం తిన్నందుకు కృతజ్ఞతగా ప్రతి నెలా ఆయనకు బియ్యం పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు.