ఎన్‌‌కంపాస్ డిజైన్ ఇండియా కు .. సినీ దర్శకుడు, స్టైల్ ఐకాన్ కరణ్ జోహార్‌‌ బ్రాండ్ అంబాసిడర్‌

ఎన్‌‌కంపాస్ డిజైన్ ఇండియా కు .. సినీ దర్శకుడు, స్టైల్ ఐకాన్ కరణ్ జోహార్‌‌ బ్రాండ్ అంబాసిడర్‌

 

  • స్టోవా పారిస్​కు కరణ్ జోహార్ ప్రచారం

హైదరాబాద్​, వెలుగు: ఎన్‌‌కంపాస్ డిజైన్ ఇండియా తన ప్రీమియం హోమ్ ఫ్యాషన్ బ్రాండ్ స్టోవా పారిస్ కోసం ప్రముఖ సినీ దర్శకుడు, స్టైల్ ఐకాన్ కరణ్ జోహార్‌‌ను బ్రాండ్ అంబాసిడర్‌‌గా నియమించుకుంది. ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. భారతీయ వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయని, ఇండ్లను తమ వ్యక్తిగత గుర్తింపునకు ప్రతీకగా భావిస్తున్నారని బిజినెస్ హెడ్ సోనియా నిగమ్​ వెల్లడించారు. ఈ సరికొత్త ప్రయాణం ద్వారా బెడ్ లినైన్​ రంగంలో బ్రాండ్ స్థానం మరింత బలపడుతుందన్నారు. ఇల్లు అనేది కేవలం నివసించే స్థలం కాదని, వ్యక్తిత్వాన్ని చూపించే అద్దం లాంటిదని కరణ్ జోహార్ తెలిపారు.