హైదరాబాద్ సిటీ పరిధిలో తాగి బండి నడిపే వాళ్ల తాట తీస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.. వీకెండ్ లో నగరవ్యాప్తంగా రోడ్లపై తనిఖీలు చేసి జైలుకు పంపుతున్నారు. తాగి బండి నడిపి వారికే కాదు, ఇతరులకుకూడా ప్రమాదంలో పడేలా చేస్తున్నారని , తాగి డ్రైవ్ చేస్తే తీవ్రపరిణామాలుంటాయని అరెస్టులతో హెచ్చరిస్తున్నారు.
ఆదివారం (నవంబర్9) హైదరాబాద్ సిటీలో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. తాగి డ్రైవ్ చేసిన మొత్తం 529 మందిని జైలుకు పంపారు. వీరందరని కోర్టులో హాజరు పర్చనున్నారు.
ఆదివారం సిటీలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్తనిఖీల్లో మొత్తం 417 బైకులు, 24 ఆటోలు , 88 కార్లను పట్టుకున్నారు ట్రాఫిక్ పోలీసులు.. తాగి వాహనాలునడుపుతున్న 529 మందిపై BNS చట్టం ప్రకారం 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం తాగి బండి నడిపిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని పోలీసులు చెప్పారు.
గత వారం కూడా తనిఖీ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. 357 డ్రంక్ అండ్ డ్రైవ్కేసులు కోర్టులో డిస్పోజ్ చేశారు. అందులో మందిని కోర్టు గత వారం లో మొత్తం 357 డ్రంక్ డ్రైవింగ్ కేసులు కోర్టుల్లో హాజరపర్చగా వారిని 307 మంది జరిమానాతో బయటపడ్డారు. మిగతా వారికి జైలు శిక్ష పడింది.
