మెంతికూర ఫుడ్.. సూపర్ రైటీస్.. టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా.. ఎలా తయారు చేయాలంటే..

మెంతికూర ఫుడ్.. సూపర్ రైటీస్.. టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా.. ఎలా తయారు చేయాలంటే..

కమ్మని వాసన గుప్పించే ఆకుకూరలు ఏవంటే.... అందరికీ మొదట గుర్తొచ్చేది  మెంతి కూర... ఎలాంటి వంటల్లోనైనా వీటిని వాడచ్చు. అప్పుడు ఆ వంటలు రుచి, సువాసనే వేరు. శరీరంలో నులిపురుగులను మెంతికూర నివారిస్తుంది, ఐరన్, విటమిన్ ఎ మొదలైన పోషక విలువలు ఈ కూరలో ఉంటాయి. అలాంటి మెంతికూరతో కొన్ని వెరైటీ వంటలు మీకోసం.. . .

మెంతికూర పచ్చడి తయారీకి కావల్సినవి

  • మెంతికూర 10 కట్టలు
  • చింతపండు- పావుకప్పు
  • నూనె- 4 టేబుల్ స్పూన్లు
  • ఎండు మిర్చి-10
  • ఆవాలు - టీ స్పూను
  • జీలకర్ర - టీ స్పూను
  • మెంతులు- కొద్దిగా
  • పసుపు- పావు టీస్పూను
  • ఇంగువ - అర టీస్పూను

మెంతికూర పచ్చడి తయారీ విధానం

ముందుగా మెంతికూరను తడి పోయేవరకు నీడలో అరబెట్టాలి. ఆ తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసి కాగాక మెంతి కూర వేసి వేగించాలి .  చింతపండు గుజ్జు ఉప్పు జత చేసి బాగా కలిపి ఆరేడు నిమిషాలు మగ్గించాలి.

మరో బాండీలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మెంతులు వేసి వేయించి దింపేయాలి..

చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా  మెత్తగా చేయాలి.  తరువాత మెంతికూర జతచేసి, మరోసారి మిక్సీ తిప్పాలి. బాండీలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి. ఒక్క పొంగు రానిచ్చి దింపేసి, మెంతికూర పచ్చడిలో వేయాలి. ఇది సుమారు నెల రోజుల దాక నిల్వ ఉంటుంది.

మెంతికూరతో పెరుగు కూర తయారీకి కావలసినవి

  • పెరుగు- ఒక కప్పు
  • శెనగపిండి- పావు కప్పు
  • పసుపు- అర టీస్పూను 
  • ధనియాలపొడి- ఒక టీస్పూను
  • కారం- పావు టీస్పూను
  • ఉప్పు- తగినంత
  • తాలింపు కోసం మెంతి కూర- వందగ్రాములు (బాగా కడిగి, సన్నగా తరగాలి)
  • ఉల్లి పాయ - ఒకటి (సన్నగా తరగాలి)
  • జీలకర్ర- పావు టీస్పూను.
  • ఆవాలు-- పావు టీ స్పూను
  •  ఎండు మిర్చి- రెండు
  • నెయ్యి- 1.5 టేబుల్ స్పూన్లు

మెంతి కూరతో పెరుగు కూర తయారీ విధానం

కదాయిలో శెనగపిండి, పెరుగు, పసుపు, ధనియాల పొడి, కారం,ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో రెండు కప్పుల నీళ్లు పోసి పేస్టులా చేసి, సన్న మంటపై ఉడికించాలి. మిశ్రమం ఉండకట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. దీని వల్ల మృదువుగా తయారవుతుంది.

పాన్ లో ఒక టీ స్పూను నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయ ముక్కలను వేగించాలి. తర్వాత అందులో మెంతి వేసి మెత్తగా అయ్యేదాక వేగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేయాలి. మెంతి, ఉల్లిపాయ మిశ్రమాన్ని కడాయిలో ఉడుకుతున్న కూరలో వేయాలి.

సాస్ పాన్లో నెయ్యి వేసి, వేడెక్కాక జీలకర్ర, ఆవాలను వేగించి, ఇవి చిటపటలాడేటప్పుడు ఎండుమిర్చిని వేయాలి. ఆ తాలింపును కూరలో వేస్తే మెంతి పెరుగు కూర రడీ.. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్​ టేస్ట్​. . .!