టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్ అయింది. ఆస్ట్రేలియా ఆశలను వర్షం తుడిచిపెట్టేసింది. ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ రద్దు కావడంతో ఆసీస్ గ్రూప్ స్టేజ్ నుంచే లీగ్ నుంచి నిష్క్రమించింది. వర్షం కారణంగా మంగళవారం.. ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చి మ్యాచ్ రద్దు చేశారు.
ఐర్లాండ్.. జింబాబ్వే మ్యాచ్ జరిగి ఉంటే ఆసీస్ తలరాత మరోలా ఉండేది. రన్ రేట్, పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియాకు మరో అవకాశం ఉండేది. వర్షం కారణంగా ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ రద్దు కావటం.. రెండు జట్లకు తలో పాయింట్ రావటంతో పాటు.. గ్రూపు దశలోనే ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లు ఓడిపోవటంతో ఇంటిదారి పట్టింది.
బలమైన జట్టుగా.. టీ 20 వరల్డ్ కప్ రేసులో ఉన్న జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా లీగ్ దశ నుంచే ఔట్ కావటంతో క్రికెట్ అభిమానులకు మజా తగ్గినట్టే. ఈ వరల్డ్ కప్లో మూడు మ్యాచులు ఆడగా.. ఐర్లాండ్ పై గెలిచిన ఆసీస్.. శ్రీలంక, జింబాబ్వే చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. 17 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా లీగ్ దశలోనే ఔట్ కావడం ఆసీస్ అభిమానులు తీవ్ర నిరాశపరిచింది.
