- 47.31 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలకు వచ్చింది 27.89 లక్షలే
- 94. 31 శాతం డిజిటైజేషన్‌తో యాదాద్రి జిల్లా టాప్
- 73 లక్షల 52 వేల 832 ఓట్లకు ముప్పు
- ముగిసిన డిజిటైజేషన్.. 17న డ్రాఫ్ట్ లిస్టు విడుదల
- నెల పాటు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరణ
- 2002 సర్‌లోని వివరాలు చాలామంది సరిగ్గా నమోదుచేయలే
- వివరణ కోసం 20 శాతం మందికి నోటీసులు వచ్చే చాన్స్
- వాళ్లు 12 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పిస్తేనే ఓటు.. లేదంటే డిలీట్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ర్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు సంబంధించిన కీలకఘట్టం ముగిసింది. ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించి, డిజిటైజేషన్ చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన గడువు సోమవారం నాటితో పూర్తయింది. రాష్ర్టవ్యాప్తంగా 33 జిల్లాలవారీగా డిజిటైజేషన్ పూర్తయిన ఓటర్ల వివరాలను ఈసీ సోమవారం సాయంత్రం
వెల్లడించింది. ఇందులో 94. 31 శాతం డిజిటైజేషన్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్‌లో ఉండగా, 58.89 శాతంతో హైదరాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లాలో 47.31లక్షల ఎన్యుమరేషన్ ఫారాలకుగాను కేవలం 27.89 లక్షలే వెనక్కి వచ్చాయి. యాదాద్రితోపాటు జనగామ(91. 68 శాతం), మెదక్(90.53%),
సూర్యాపేట (90.45%), మహబూబాబాద్(91.11%) జిల్లాల్లో 90 శాతానికి మించి డిజిటైజేషన్ పూర్తికాగా, హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి (65.16%), మేడ్చల్ (63. 97%), సంగారెడ్డి (79.51%), హన్మకొండ(79.99%) జిల్లాలు వెనుకబడ్డాయి.
రాష్ర్టవ్యాప్తంగా 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లు ఉండగా, అందరికీ (100 శాతం) ఎన్యుమరేషన్ఫారాలు అందజేసినట్లు ఈసీ ప్రకటించింది. కానీ చివరి గడువైన సోమవారం సాయంత్రం వరకు ఇందులో 2 కోట్ల 64 లక్షల 73 వేల 616 (78.26 శాతం) అప్లికేషన్లు మాత్రమే వెనక్కి రాగా, వాటి డిజిటైజేషన్ పూర్తయింది.సోమవారం రాత్రి12 వరకు బీఎల్ఓలు ఎన్యుమరేషన్ఫారాలు ఇచ్చేందుకు గడువు ఉన్న నేపథ్యంలో ఈ శాతంలో స్వల్ప మార్పు ఉండవచ్చని తెలుస్తున్నది. ఈ వివరాలను ఈసీ మంగళవారం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. మొత్తంమీద 73 లక్షల 52 వేల 832 లక్షల ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. ఇందులో 9 లక్షల మంది ఓటర్లు మరణించగా, 45 లక్షల ఓటర్ల అడ్రస్ దొరకలేదు. 11 లక్షల ఫారాలు వెనక్కి రాలేదు. మరో 6 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. కాగా, ఈ నెల 17న బూత్‌లవారీగా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్టులను ఈసీ ప్రచురిస్తుంది. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత నెల పాటు అభ్యంతరాలు, క్లెయిమ్స్స్వీకరిస్తారు. 2002 నాటి సర్‌లో ఉన్న కుటుంబసభ్యుల వివరాలు సరిగ్గా ఇవ్వని వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు అందుకున్న వారు12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవచ్చు. సరైన వివరాలు ఇవ్వని వారి ఓట్లను మాత్రం జాబితా నుంచి తొలగిస్తారు.
హైదరాబాద్ జిల్లాలో భారీగా..
హైదరాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. జిల్లాలో 47 లక్షల 36 వేల 669 ఓట్లుండగా, దాదాపు100 శాతం ఎన్యుమరేషన్ఫారాలు పంపిణీ చేశారు. ఇందులో 27 లక్షల 89 వేల 214 ఫారాలుమాత్రమే బీఎల్ఓల ద్వారా వెనక్కివచ్చాయి. వాటికి మాత్రమే డిజిటైజేషన్ పూర్తిచేశారు. ఇది 58.89 శాతం కాగా, 41.09 శాతం ఓట్లు ప్రమాదంలో పడినట్లయింది. వీటిలో అడ్రస్మారినవి, డూప్లికేట్ ఓట్లే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో చనిపోయిన ఓటర్లు ఉన్నట్లు చెప్తున్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 1,79,749 మంది ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓటర్లుగా నమోదయ్యారు. ఒక్క చార్మినార్ మినహా అన్నిచోట్ల ఈ సంఖ్య లక్షకుపైగానే ఉంది. యాకుత్‌పురాలో 1,55,252 , చాంద్రాయణగుట్టలో 1,49,365, మలక్‌పేటలో 1,47,552, కార్వాన్‌లో 1,42,016, ముషీరాబాద్‌లో 1,40,381 , నాంపల్లిలో 1,37,448, ఖైరతాబాద్‌లో 1,23,879, బహదూర్‌పురాలో 1,21, 111, అంబర్‌పేటలో 1,20,280, సనత్‌నగర్‌లో 1,14,916, గోషామహల్‌లో 1,10,531, కంటోన్మెంట్‌లో 1,05,223 , సికింద్రాబాద్‌లో 1,03,374 మంది ఏఎస్‌డీ ఓటర్లున్నారు. చార్మినార్ నియోజకవర్గంలో తక్కువగా 95,024 ఓట్లు డేంజర్‌జోన్‌లో ఉన్నాయి.
పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, పాతబస్తీలో నకిలీల జోరు
ఓటర్ల లిస్టులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న డూప్లికేట్ లేదా డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీలు కూడా భారీగానే బయటపడ్డాయి. ఒకే పర్సన్ నేమ్, తండ్రి పేరు, ఫొటోలతో డిఫరెంట్ బూత్‌లలో లేదా డిఫరెంట్ ఐడీలతో ఓట్లు ఉన్న డూప్లికేట్ రికార్డులు రాష్ట్రవ్యాప్తంగా 6.60 లక్షలు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ అనాలిసిస్‌లో తేలింది. ఇవి మెయిన్‌గా పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, పాతబస్తీ పరిధిలోనే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మరోవైపు, బీఎల్‌ఓలు రెండు మూడు సార్లు డోర్ నాక్ చేసినా ఇంట్లో జనాలు దొరక్కపోవడంతో దాదాపు11 లక్షలకు పైగా ఎన్యుమరేషన్ ఫారాలు అన్‌కలెక్టెడ్ కేటగిరీ కింద పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇవి కాకుండా ఫారినర్లకు చెందిన దాదాపు 13 వేల ఓటర్ల ఫారాలను కూడా పక్కన పెట్టారు.
అడ్రస్‌లు మారినోళ్లు 45.30 లక్షలు
డిజిటైజ్ కాకుండా ఆగిపోయిన మొత్తం 73.52 లక్షల ఎంట్రీలలో అత్యధికంగా నివాసాలు శాశ్వతంగా మారిన వాళ్లే ఉన్నారు. జాబ్స్, బిజినెస్, స్టడీస్, ఇతర కారణాల వల్ల పాత అడ్రస్‌లను వదిలేసి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓటర్ల సంఖ్య స్టేట్‌వైడ్‌గా ఏకంగా 45.30 లక్షలుగా తేలింది. ఈ షిఫ్టింగ్స్ మెజారిటీగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లోనే విపరీతంగా ఉన్నట్లు డేటా చెప్తోంది. ఐటీ కారిడార్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఇండ్లు మారిన వాళ్లు తమ పాత పోలింగ్ బూత్‌లలో నమోదు కాలేదు.
20 శాతం మందికి నోటీసులు
ప్రస్తుతం వెనక్కి వచ్చిన ఫారాలలో చాలా మంది ఓటర్లు 2002 సర్ జాబితాలోని కుటుంబసభ్యుల వివరాలు సరిగ్గా నమోదుచేయలేదని తెలుస్తోంది. కొందరైతే తమ సొంత వివరాలను కూడా తప్పుగా నింపారని అధికారులు అంటున్నారు. మొత్తం మీద హైదరాబాద్జిల్లాలో దాదాపు 20 శాతం మందికి నోటీసులు జారీ చేసి, వివరణ కోరే అవకాశముందని చెప్తున్నారు. ఆయా ఓటర్లు ఇచ్చే వివరణ, ఐడీ ప్రూఫులు సరిగ్గా లేకపోతే మరికొన్ని ఓట్లు గాయబ్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాపంగా
డిజిటైజ్ కాని ఎన్యుమరేషన్ ఫారాలు 73.52 లక్షలు
మరణించిన ఓటర్లు 9.22 లక్షలు
శాశ్వతంగా నివాసం మారిన ఓటర్లు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అధికం) 45.30
లక్షలు
డూప్లికేట్ ఓట్లు(శేరిలింగంపల్లి, పటాన్‌చెరు,
పాతబస్తీలోనే ఎక్కువ)6.60
లక్షలు
వెనక్కిరాని
ఫారాలు11
లక్షలు
