T20 World Cup: టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. మంగళవారం పల్లెకలె వేదికగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వే టీం సూపర్–8కి అర్హత సాధించింది. దీంతో టీమిండియాకు సూపర్–8 దశలో ఏ ఏ జట్టుతో ఆడనుంది అనే దానిపై క్లారిటీ వచ్చింది. సూపర్–8 గ్రూప్–1లో భారత్ తో పాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు ఉన్నాయి. భారత్ ఈ మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడబోతుంది. టీమిండియా సూపర్–8 ప్రయాణం ఫిబ్రవరి 22వ తేదీన అహ్మదాబాద్‌లో ప్రోటీస్ జట్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 26వ తేదీన చెన్నైలో జింబాబ్వేతో పోటీ పడనుండగా.. ఇక సూపర్–8లో చివరి మ్యాచ్‌ను మార్చి 1వ తేదీన కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తలపడబోతుంది.
భారత్ సూపర్–8 షెడ్యూల్:
* ఫిబ్రవరి 22 – దక్షిణాఫ్రికాతో (అహ్మదాబాద్)
* ఫిబ్రవరి 26 – జింబాబ్వేతో (చెన్నై)
* మార్చి 1 – వెస్టిండీస్‌తో (కోల్‌కతా)
ఇదిలా ఉంటే, నేడు (ఫిబ్రవరి 18) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ తమ చివరి గ్రూప్-దశ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి అజేయంగా సూపర్–8లోకి ప్రవేశించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నెదర్లాండ్స్ టీం ఇప్పటి వరకు భారత్‌తో ఒక్కసారి మాత్రమే పోటీ పడింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
భారత జట్టు అంచనా:
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా..
నెదర్లాండ్స్ జట్టు అంచనా:
మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (వికెట్ కీపర్/ కెప్టెన్)), జాచ్ లయన్-కాచెట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, ఫ్రెడ్ క్లాసెన్..
