Sneha Reddy: ఐకాన్ స్టార్‌పై స్నేహ రెడ్డి 'లవ్లీ' పోస్ట్.. ఆటో వెనుక ఉన్న పేరు చూసి ఫిదా!

Sneha Reddy: ఐకాన్ స్టార్‌పై స్నేహ రెడ్డి 'లవ్లీ' పోస్ట్.. ఆటో వెనుక ఉన్న పేరు చూసి ఫిదా!

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరికి పెళ్లై 14 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొత్త జంటలాగే కనిపిస్తుంటారు. షూటింగ్స్ కొంచె సమయం దొరికితే చాలు బన్నీ టూర్ ప్లాన్ చేసి ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తారు. ట్రావెల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. లేటెస్ట్ గా స్నేహ రెడ్డి తన భర్త బన్నీపై ఉన్న ప్రేమను చాటుతూ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఆటో వెనుక 'బన్నీ' క్రేజ్!

హైదరాబాద్ రోడ్లపై ప్రయాణిస్తున్న సమయంలో స్నేహ రెడ్డి దృష్టిని ఒక ఆటో ఆకర్షించింది. ఆ ఆటో వెనుక "ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకా" అని రాసి ఉంది. సాధారణంగా అభిమానులు తమ హీరోల పేర్లు వాహనాలపై రాసుకోవడం సహజమే. కానీ, తన భర్తకు సామాన్యుల్లో ఉన్న ఈ క్రేజ్‌ను చూసి మురిసిపోయింది స్నేహ. ఆ వెంటనే దాన్ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు.  ఈ ఫోటోను చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

వైరల్ అవుతున్న ఫ్యాన్స్ రియాక్షన్స్

ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్నేహ గారు భర్త క్రేజ్‌ను భలే ఎంజాయ్ చేస్తున్నారు అని కొందరు కామెంట్స్ చేయగా..  అల్లు అర్జున్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు, అదొక ఎమోషన్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్, స్నేహ రెడ్డిలను ఉద్దేశిస్తూ.. తమ భర్తలను ఇంతగా ప్రేమించే భార్యలను చూడటం చాలా ముచ్చటగా ఉంది అని ఫ్యాన్స్ ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు.

ALSO READ : ఇది సహజ మరణం కాదు.. 

బన్నీ నెక్స్ట్ లెవెల్!

'పుష్ప 2: ది రూల్' సినిమాతో రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్  ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు.. దీంట్లో బన్నీ సరసన దీపికా పదుకొనె నటిస్తోంది.  మరో వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా, అలాగే 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఒక పవర్ ఫుల్ ప్రాజెక్ట్ లైన్‌లో ఉన్నాయి.