మళ్లీ హాలీవుడ్ కి ఐశ్వర్యరాయ్

మళ్లీ హాలీవుడ్ కి  ఐశ్వర్యరాయ్

టాలీవుడ్ హీరోయిన్లందరికీ బాలీవుడ్ వెళ్లాలని ఆశ. బాలీవుడ్ హీరోయిన్లకేమో హాలీవుడ్ వెళ్లాలని ఆశ. ఇప్పటికే కొంతమంది ఆ ఆశను తీర్చుకున్నారు. వారిలో ఐశ్వర్యా రాయ్ కూడా ఉంది. ప్రైడ్ అండ్ ప్రెజ్యుడీస్, ద మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్, ద లాస్ట్ లీజియన్, ద పింక్ ప్యాంథర్ 2 చిత్రాల్లో నటించింది. ఇప్పుడు హాలీవుడ్ లో మరొక చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా ఇటీవల వెల్లడించింది. అయితే వివరాలు చెప్పడం లేదు. ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ తనను అప్రోచ్ అయ్యిందని, తాను కూడా ఓకే అన్నానని చెప్పింది. హాలీవుడ్ మీద ఎందుకంత ఇష్టం, బాలీవుడ్లో అవకాశాలు లేవా అంటే నవ్వేసింది. ‘అదేమీ కాదు. వచ్చిన అవకాశాన్ని బట్టే నా ఎంపిక ఉంటుంది. ఏ ఉడ్ అన్నది ముఖ్యం కాదు. నాకొచ్చిన పాత్ర ఎలాంటిదన్నదే ముఖ్యం. కాబట్టి నాకు తగ్గ రోల్ ఎవరు ఆఫర్ చేసినా నటిస్తాను ’ అంది ఐష్. ఈ మధ్య ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె గురించి కంప్లయింట్ చేస్తున్నారు. మరి హాలీవుడ్ వారికి ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా స్పెషల్ ప్రాజెక్టే అయ్యుంటుంది.