లేడీస్​ డ్రెస్లో బాలీవుడ్ స్టార్ హీరో డాన్స్

లేడీస్​ డ్రెస్లో బాలీవుడ్ స్టార్ హీరో డాన్స్

బాలీవుడ్​ స్టార్​ హీరో​ అక్షయ్​ కుమార్​ది ఓ డిఫరెంట్​ స్టైల్. ఆయన ఈ ఏడాది అరడజన్​ సినిమాల షూటింగ్​లు పూర్తి చేశాడు. ప్రస్తుతం అక్షయ్ అమెరికా అట్లాంటాలో ఎంటర్​టైన్​మెంట్​ టూర్​లో ఉన్నాడు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్​ సెలబ్రిటీలు స్టేజ్​ పెర్ఫార్మెన్స్​ ఇచ్చారు. ఇందులో అక్షయ్​ కుమార్ ఎరుపు రంగు లెహంగా వేసుకొని నోరా ఫతేహితో కలిసి స్టేజ్ పై డాన్స్​చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ​అయ్యింది. స్టార్​డమ్ పక్కన పెట్టి ఎంత సాధారణంగా లేడీస్​ డ్రస్​ వేసుకొని అక్షయ్​ డాన్స్ ​చేశాడని నెట్టిజన్లు ఆసక్తికర ట్వీట్లు పోస్టు చేస్తున్నారు.