క్రేజీ మల్టీస్టారర్‌‌‌‌లో అలియాభట్

క్రేజీ మల్టీస్టారర్‌‌‌‌లో అలియాభట్

గ్లామర్ రోల్స్‌‌తో పాటు ‘గంగూబాయ్ కతియావాడి’ లాంటి ఫిమేల్‌‌ సెంట్రిక్ మూవీస్‌‌తో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది అలియాభట్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇటు సౌత్‌‌ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఆమె, ఇటీవలే ఓ బిడ్డకు తల్లయింది. అయితే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తిరిగి షూటింగ్స్‌‌తో బిజీ అయింది. తాజాగా ఆమె ఓ క్రేజీ మల్టీస్టారర్‌‌‌‌లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌‌లో అయాన్‌‌ ముఖర్జీ డైరెక్షన్‌‌లో ‘వార్‌‌‌‌ 2’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 

యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌ నిర్మించే ఈ స్పై యూనివర్స్‌‌ మూవీలో ఓ హీరోయిన్‌‌గా అలియాభట్‌‌ను సంప్రదించినట్టు బాలీవుడ్ టాక్. ఇద్దరు హీరోల్లో ఎవరికి జంటగా నటిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అలియా నటించింది రామ్ చరణ్‌‌కు జంటగా అయినప్పటికీ, ఎన్టీఆర్‌‌‌‌తోనూ క్లోజ్‌‌ ఫ్రెండ్‌‌ షిప్‌‌ ఏర్పడింది. ఇటీవల ఎన్టీఆర్‌‌‌‌ పిల్లల కోసం స్పెషల్ గిఫ్ట్స్ కూడా పంపింది అలియా. అదీగాక తారక్‌‌తో కొరటాల శివ తీసే సినిమాలో హీరోయిన్‌‌గా మొదట అలియానే అనుకున్నారు కూడా. కానీ సినిమా ఆలస్యమవడంతో.. అలియా స్థానంలో జాన్వీకపూర్‌‌‌‌ని ఫైనల్ చేశారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌‌‌‌తో కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారైనా జంటగా నటిస్తుందేమో చూడాలి!