స్పెషల్ ట్రీట్

స్పెషల్ ట్రీట్

బాలీవుడ్‌‌లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌‌లో ఆలియా భట్ మొదటి వరుసలో ఉంది. అందుకే చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె నటిస్తున్న చిత్రాల లిస్టులో ‘ఆర్‌‌‌‌ఆర్ఆర్‌‌‌‌’ ఒకటి. రాజమౌళి తీస్తున్న ఈ భారీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో రామ్‌‌చరణ్ సరసన హీరోయిన్‌‌గా నటిస్తోంది ఆలియా. బాలీవుడ్‌‌లో సైతం మూవీపై ఆసక్తిని రేకెత్తించే క్రమంలో ఆలియా పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడట జక్కన్న. అదొక్కటే కాకుండా.. ఆమెకి ఓ స్పెషల్‌‌ సాంగ్‌‌ కూడా పెట్టనున్నారనే వార్త తాజాగా గుప్పుమంది. దీన్ని ఆలియాను దృష్టిలో ఉంచుకునే తయారు చేస్తున్నారని, ప్రమోషన్స్‌‌లో ఈ పాటను ప్రముఖంగా వాడతారని చెబుతున్నారు.

ఆలియాకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి దర్శకుడు.. తారక్, చెర్రీలు హీరోలు.. అలాంటి ఈ సినిమాకి హీరోయిన్‌‌ ద్వారా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురికి ఆలియా యాడ్‌‌ అయితే మరింత క్రేజ్ ఏర్పడుతుందని భావించడంలో తప్పు లేదు కదా అని ఆలియా అభిమానులు సమర్థిస్తున్నారు. ఎవరికి వారు ఇలా అనుకోవడమే తప్ప.. అసలీ వార్త నిజమో కాదో మాత్రం ఎవరూ చెప్పరు. ఇప్పటి వరకు ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ గురించి వచ్చిన వార్తలన్నింటి విషయంలోను అదే జరిగింది. మరి దీని గురించైనా ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.