హోలీ కానుక : 20న అమీర్ పేట్-హైటెక్ సిటీ మెట్రోరైలు ప్రారంభం

హోలీ కానుక : 20న అమీర్ పేట్-హైటెక్ సిటీ మెట్రోరైలు ప్రారంభం

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. సిటీలో మోస్ట్ వాంటెడ్ లైన్, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమీర్ పేట్ – హైటెక్ సిటీ మెట్రో రైలు మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే అన్ని అనుమతులు పొందిన ఈ రైలు మార్గం… మార్చి 20 బుధవారం హోలీ పండుగ రోజున ప్రారంభం కానుంది.

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అమీర్ పేట్ – హైటెక్ సిటీ మెట్రో రైలు కొత్త రూట్ ను ప్రారంభిస్తారు. కారిడార్ 3లో భాగంగా ఈ మార్గాన్ని నిర్మించింది హెచ్ఎంఆర్. మార్చి 20న ఉదయం 9.30 గంటలకు మెట్రో రైలును ప్రారంభిస్తారు గవర్నర్. ఆ తర్వాత ప్యాసింజర్లతో కలిసి అందులో ప్రయాణిస్తారు.

నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు నాన్ స్టాప్ జర్నీ

అమీర్ పేట్- హైటెక్ సిటీ మార్గం హైదరాబాద్ నగరంలో జనం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ లో ఎక్కిన ప్రయాణికుడు.. నిరంతరాయంగా.. నేరుగా హైటెక్ సిటీ వరకు ప్రయాణించొచ్చు. అమీర్ పేట్ ఇంటర్ జంక్షన్ లో దిగాల్సిన అవసరం ఉండదు.

ఎల్బీనగర్ లో మెట్రో ఎక్కిన ప్రయాణికులు అమీర్ పేట్ ఇంటర్ జంక్షన్ మెట్రో స్టేషన్ లో దిగి.. హైటెక్ సిటీ వరకు ప్రయాణించొచ్చు.

సాఫ్ట్ వేర్ కంపెనీలు, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో ఉద్యోగాలు చేసే సిటీ ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరినట్టే.