జనాభా నమోదుకోసం యాప్.. దేశమంతా ఒకే గుర్తింపు కార్డ్

జనాభా నమోదుకోసం యాప్.. దేశమంతా ఒకే గుర్తింపు కార్డ్

ఈసారి  జనాభా లెక్కలను  డిజిటలైజ్  చేస్తున్నామన్నారు  కేంద్ర  హోంమంత్రి అమిత్ షా.  ప్రజలు  తమకు  తాముగా  వివరాలను  అప్ లోడ్  చేసుకునే విధంగా  మొబైల్ యాప్   తీసుకొస్తున్నట్టు  చెప్పారు. జనాభా  లెక్కల్లో  పేపర్ వాడకాన్ని  తగ్గిస్తామన్నారు . 2021   మార్చ్ 1  నుంచి  జనాభా లెక్కలు జరగనున్నాయి.  జనగణన  అవసరం  ప్రజలకు  తెలియాలన్నారు  అమిత్ షా. ఢిల్లీలో   కొత్తగా నిర్మించిన  రిజిస్ట్రార్  జనరల్ ఆఫ్  ఇండియా బిల్డింగ్ ను అమిత్ షా  ప్రారంభించారు.

దేశమంతటికీ ఒకే గుర్తింపు కార్డ్ 

అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమంతటా ఒకే గుర్తింపు కార్డు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు అమిత్ షా. పాస్ పోర్టు, బ్యాంక్ అకౌంట్, ఆధార్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వీటన్నింటికీ కలిపి ఒకే గుర్తింపు కార్డు ఉంటే బాగుంటుందనే చర్చ జరుగుతోందన్నారు. ఈ ప్రతిపాదన త్వరలోనే సాధ్యం చేయబోతున్నామని చెప్పారు.