ఎవరీ కొత్త బ్యూటీ.. కుర్రోళ్లకు మత్తెక్కిస్తుంది..?

ఎవరీ కొత్త బ్యూటీ.. కుర్రోళ్లకు మత్తెక్కిస్తుంది..?

బాలీవుడ్​లో ఫేం రానివారు సౌత్​ బాట పడతారనేది పాత కాన్సెప్ట్​. బాహుబలి, కాంతార వంటి ప్యాన్​ ఇండియా హిట్స్​ తర్వాత దక్షిణాది సినిమా రేంజ్​ అమాంతం పెరిగింది. దీంతో ఉత్తరాది నటులు, టెక్నీషియన్లు సైతం ఇక్కడి సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. అలియా, జాన్వీ కూర్​ వంటి వారు ఇప్పటికే తెలుగు పరిశ్రమలో నటించడంపై తమ ఇష్టాన్ని తెలిపారు. 

తాజాగా బాలీవుడ్​ నుంచి సౌత్​కు కొత్త బ్యూటీ వస్తోంది. ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్​ బాయ్’​ సినిమాలో అమ్రీన్​ ఖురేషి(Amrin Qureshi) హీరోయిన్​గా మెప్పించింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీకి సౌత్​ నుంచి బడా బ్యానర్స్​లో ఆఫర్లు వస్తున్నాయి. 

ఇప్పటికే కంగువా, సర్దార్​ వంటి సినిమాలు నిర్మించిన గ్రీన్​ స్టూడియోస్​, సన్​ పిక్చర్స్​ వంటి బ్యానర్స్​ అమ్రీన్​కు పిలిచి చాన్స్​ ఇచ్చారట. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తన సినిమాలను అనౌన్స్​ చేయనుంది.